హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోపలో మాట బయటో మాట: కిషోర్ చంద్రదేవ్‌పై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ లోపలో ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మాట్లాడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. తనపై కిషోర్ చంద్రదేవ్ ఆరోపణలు సమంజసం కాదన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారో తనకు తెలియదన్నారు. కొమరాడకు నీరు ఇవ్వవద్దని తాను లిఖిత పూర్వకంగా లేఖ రాసినట్లు చెప్పారు.

కొణిజేటి రోశయ్య హయాంలో నీటి కేటాయింపులపై ఉత్తర్వులు నిలిపి వేశామన్నారు. ఇప్పుడు జివో వచ్చిన విషయం తనకు తెలియదన్నారు. ఆ వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. కిషోర్ చంద్రదేవ్ నీటి విడుదలకు సుముఖంగా ఉన్నారని అధికారులు చెప్పార్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. ప్లాంటులో కిషోర్‌కు వాటాలు ఉన్నాయో లేవో తెలియవని, తనకైతే ప్లాంటులో ఎలాంటి వాటాలు లేవన్నారు.

కాగా ఉదయం కిషోర్ చంద్రదేవ్ పైన మంత్రులు శత్రుచర్ల విజయ రామరాజు, గంటా శ్రీనివాస రావు మంగళవారం తీవ్రస్థాయిలో వేర్వేరుగా మండిపడ్డ విషయం తెలిసిందే. కిషోర్ పైన ముప్పేట దాడి జరుగుతోంది. పవర్ ప్లాంటులలో తనకు వాటాలు ఉన్నాయని కిషోర్ చెప్పడం గర్హనీయమని శత్రుచర్ల అన్నారు. తనకు పవర్ ప్లాంటులలో ఎలాంటి వాటాలు లేవన్నారు. వాటాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్యకు సిద్ధమని, నిరూపించని పక్షంలో ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉంటారా అని సవాల్ విసిరారు.

మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిపై, సత్యనారాయణలపై లేనిపోని వ్యాఖ్యలు చేసిన కిషోర్ చంద్రదేవ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ పై ఏ అర్హతతో లేఖ రాశారో కిషోర్ చెప్పాలని ఆయన అన్నారు. కిరణ్ సమర్ధంగా పాలన చేస్తున్నారని అన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana blamed central minister Kishore Chandra Dev on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X