బొత్స కూతురు పెళ్లికి 50 కోట్లు ఖర్చు: హైకోర్టులో పిల్

బొత్స వివాహంలో చేసిన భారీ ఖర్చులపై ఆదాయ పన్ను శాఖ ముఖ్య కమిషనర్‌తో విచారణకు ఆదేశించాలని, ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల వసతి, రవాణాకు ప్రభుత్వం వెచ్చించిన సొమ్ముపై నివేదిక సమర్పించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని పిల్‌లో కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఏ, మంత్రి బొత్స సత్యనా రాయణ, ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. బొత్స కుమార్తె వివాహ వేడుకలో భారీగా అధికార దుర్వినియోగం జరిగిందని, సుమారు 50 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయని ఆయన పిల్‌లో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications