హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశ్వాసంలేకే జగన్ వైపు, కొత్తొక వింత పాతొక రోత: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సభలకు జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయా అని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఆత్మస్థైర్యం లేని వాళ్లే పార్టీని వీడి వెళ్లిపోతున్నారని ఆయన విమర్శించారు. కొత్త ఒక వింత పాత ఒక రోత ఇది తెలిసిన సామెతనే అన్నారు.

ఇవన్నీ సాధారణమేనని, త్వరలో కాంగ్రెసు పార్టీ తిరిగి బాగా పుంజుకుంటుందని చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని, తిరిగి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. వారిపై వారికి నమ్మకం లేని వారే ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీని వీడాలని భావిస్తున్న వారితో ఇక చర్చలు జరపాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని జెసి అభిప్రాయపడ్డారు.

కాగా తాను పార్టీని వీడటం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ వేరుగా చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో తాము పని చేశామని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీలోనే ఎప్పటికీ ఉంటానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు వారి సొంత లాభం కోసం పార్టీని వీడుతున్నాట్లుగా కనిపిస్తోందన్నారు.

కాంగ్రెసు ఓ సిద్ధంతంతో ముందుకు వెళ్తున్న పార్టీ అన్నారు. 2014 వరకు కాంగ్రెసు పార్టీ అధికారంలో కొనసాగుతుందని, ఒడిదుడుకులు ఎదుర్కోవడం కాంగ్రెసు పార్టీకి కొత్త కాదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని, మూడోసారి అధికారంలోకి రాదేమోననే ఆలోచన వట్టిదే అన్నారు.

English summary
Former Minister JC Diwakar blamed Congress MLAs who are ready to go with YSR Congress party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X