జగన్ వైపు మజ్లిస్: కిరణ్‌కు ముందే సంకేతాలు?

Kiran Kumar Reddy - Asaduddin Owaisi
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్లుగా ప్రభుత్వానికి ముందే సంకేతాలు ఉన్నాయా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. మజ్లిస్ నేతలను చల్లబర్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయం కూడా హడావుడిగానే స్పందించినట్లుగా వార్తలొస్తున్నాయి. మజ్లిస్ నేతలు వివిధ సందర్భాలలో చేసిన విజ్ఞప్తులపై సర్కారు ఆగమేఘాల మీద స్పందించిందట. దానిని పరిశీలిస్తే కిరణ్ సర్కారుకు వారి మద్దతు ఉపసంహరణ ముందే తెలిసినట్లుగా ఉండవచ్చంటున్నారు.

మజ్లిస్ కోరిన 41 అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా దృష్టి సారించిందట. రాజధానిలోని నిషేధిత భూములకు సంబంధించిన జాబితాను సర్కారు ఉపసంహరించుకోవడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. దీంతో పాటు పలు కోర్కెలను మజ్లిస్ కోరితే సర్కారు ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నదని అంటున్నారు. తెరపైకి భాగ్యలక్ష్మి ఆలయం వివాదాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే మజ్లిస్ తెచ్చిందని ఇప్పటికే వాదనలు ఉన్నాయి.

సర్కారు మజ్లిస్ 41 అంశాలపై ఆగమేఘాల స్పందించిన తీరును చూసే ఇదంతా ఆ పార్టీ వ్యూహాత్మకంగా చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించే భాగంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దగ్గరయ్యేందుకు మజ్లిస్ నేతలు ముందే ఓ నిర్ణయానికి వచ్చారని, ఆ సంకేతాలు ప్రభుత్వానికి ఇచ్చి హడావుడిగా తమ పనులు చేయించుకునేందుకు సిద్ధమయి ఉంటారని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ పనులు పూర్తి చేసినా వారు ఉండే వారు కాదని అంటున్నారు.

మహావీర్ స్థలం ఇస్తామని కిరణ్ చెప్పారు

మహవీర్ ఆసుపత్రి స్థలం లీజు గడువు పూర్తయిందని, దానిని తమ సంస్థ కోసం తీసుకోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు ప్రతిపాదిస్తేనే.. దాని కోసం దరఖాస్తు చేసుకున్నామని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+