వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగీరథ విజయయాత్ర: రఘువీరా రెడ్డి 'బాట'లో కెవిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
అనంతపురం: రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి భగీరథ విజయ యాత్రలో కెవిపి రామచంద్ర రావు మంగళవారం పాల్గొన్నారు. ఆయన పాదయాత్రలో పాల్గొన్న కెవిపి రామచంద్ర రావు మద్దతు పలుకుతున్నట్లుగా చెప్పారు. రఘువీరా రెడ్డి భగీరథ విజయ యాత్ర మంగళవారం మూడో రోజుకు చేరుకుంది.

కాగా రఘువీరా రెడ్డి భగీరథ విజయయాత్ర ఆదివారం కర్నూలు జిల్లా మల్యాల నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ యాత్ర అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయరు వరకు కొనసాగుతుంది. 12 రోజులు 236 కిలోమీటర్ల మేర రఘువీరా రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. తొలి రోజు పదకొండు కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. రెండో రోజు ఇరవై కిలోమీటర్లకు పైగా నడిచారు. రాయలసీమ ప్రజల చిరకాల కల హంద్రీనీవా ప్రాజెక్టు సాకరమైన నేపథ్యంలో రఘువీరా భగీరథ విజయయాత్రకు శ్రీకారం చుట్టారు.

రఘువీరా రెడ్డి చేపట్టిన ఈ యాత్రను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. జలయజ్ఞం ధన యజ్ఞమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, వారి ఆరోపణలు అబద్దమని చెప్పేందుకు హంద్రీనీవానే మంచి నిదర్శనమని ఈ సందర్భంగా బొత్స అన్నారు.

రైతుల్లో ఆత్మస్థైర్యం, ధైర్యం నింపేందుకే తాను ఈ పాదయాత్రను చేస్తున్నానని రఘువీరా రెడ్డి చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలల వలే తాను రాజకీయాల కోసం పాదయాత్ర చేయడం లేదన్నారు. రైతుల కోసం, రాయలసీమ ప్రజల కోసమే చేస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు.

English summary

 KVP Ramachandra Rao participated in minister Raghuveera Reddy's Bhageeratha Vijaya Yatra on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X