ప్రజలే జగనన్న ధైర్యం: షర్మిల, నేడు తెలంగాణలోకి..

రాష్ట్రంలో వైఎస్ నుంచి లబ్ధి పొందిన ఎందరో నేతలు జగన్‌ను వెన్నుపోటు పొడిచినా, ప్రజలు మాత్రం జగనన్న వెంటే నిలుస్తున్నారని తెలిపారు. వైప్రస్తుత పరిస్థితిలో అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే జగనన్న నాయకత్వంలోనే సాధ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయనీ, వారి నాటకంలో జగనన్న బలయ్యారని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వస్తే వైఎస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామనీ, ప్రతి పేదోడికి ఉచిత ఇల్లు కట్టించి ఇస్తామనీ చెప్పారు.
తల్లికి, బిడ్డకు మధ్య ఉన్న అనుబంధం వంటిదే విశ్వసనీయత అని వైయస్ విజయమ్మ చెప్పారు. బుధవారం రాత్రి కర్నూలు నగరంలో జరిగిన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతబస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సిబిఐ 28 బృందాలను వేసి కేసులు నమోదు చేసి జగన్‌ను జైల్లో పెట్టిందని విమర్శించారు. అదే చంద్రబాబుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు విశ్వసనీయత గురించి ప్రశ్నించే అర్హత లేదన్నారు.
ప్రజలతో అలాంటి అనుబంధం ఏర్పరుచుకున్న వైయస్ రాజశేఖరరెడ్డి తుది శ్వాస వరకు ప్రజా సమస్యలతో పోరాడి, ప్రజల వెంటే ఉండి ప్రాణాలు వదిలారని ఆమె చెప్పారు. సమస్యలపై పోరాడిన రైతులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి జైళ్లలోపెట్టిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. వైయస్ పథకాలు అమలవుతాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
అనంతరం షర్మిల మాట్లాడుతూ, వైయస్ పుణ్యమా అని కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని, ఇంకా ఎందరోనేతలు పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. వైయస్ పేరును చార్జ్‌షీట్‌లో చేర్చినా కూడా పెదవి విప్పని నేతలకు విశ్వసనీయత ఉందా అని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications