తెలంగాణలో అడుగుపెట్టిన షర్మిల: భారీగా జనం

రాయలసీమలో 625 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల మహబూబ్‌నగర్‌లో 225 కిలోమీటర్లు నడక సాగిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర సాగుతుంది. ఆమె వెంట పాదయాత్రలో వాసిరెడ్డి పద్మతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యెడ్మ కిష్టారెడ్డి, స్వర్ణా సుధాకర్ ఉన్నారు. కాంగ్రెసుకు చెందిన మాజీ శాసనసభ్యురాలు స్వర్ణా సుధాకర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.
ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలోని పుల్లూరు గ్రామానికి చేరుకున్నారు. తెలంగాణవాదుల నుంచి ఆమెకు ప్రతిఘటన ఎదురు కాలేదు. భద్రతా కారణాల రీత్యా ఆమె పాదయాత్ర భద్రతా వలయంలో సాగుతోంది. ఈ పాదయాత్రకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, నల్లగొండ, కర్నూలు జిల్లాల నుంచి కార్యకర్తలు తరలి వచ్చారు.
షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్‌లోకి గురువారం మధ్యాహ్నం 2 గంటలకే ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఆమె విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. గురువారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలో 11 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. అయితే, ఆలస్యం కావడంతో కొద్ది దూరం మాత్రమే ఆమె నడక సాగిస్తారు. పెనబొట్ల గ్రామంలో ఆమె బస చేస్తారు.












Click it and Unblock the Notifications