జగన్ మద్దతిస్తేనే ప్రధాని, చక్రం తిప్పుతారు: నల్లపురెడ్డి

రానున్న రోజులు అన్నీ వైయస్సార్ కాంగ్రెసువే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తమ పార్టీ చక్రం తిప్పుతుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన వ్యక్తే ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డ్రామాలను ఎవరూ నమ్మడం లేదన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
కాగా వైయస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించనుంది. కర్నూలు జిల్లా నుంచి తుంగభద్ర బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది. ఆ తర్వాత పుల్లూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. యాత్రలో కార్యకర్తలు షర్మిలకు సమస్యలు తెలియజేయాలని, పూలు చల్లడం వంటివి చేయవద్దని నేతలు సూచించారు.












Click it and Unblock the Notifications