బాబును కలిసిన భువనేశ్వరి: షర్మిల యాత్ర ప్రారంభం

Chandrababu Naidu - Sharmila
మెదక్/మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది. మెదక్ జల్లా మనూరు నుండి బాబు పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు మనూరులోనే కలుసుకున్నారు. బాబు సతీమణి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు ఆయనను కలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

అంతకుముందు రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ అధినేతను కలుసుకున్నారు. చంద్రబాబు శనివారం తన పాదయాత్రను ముగించి మనూరులో బస చేశారు. ఆయనను ఉదయం పూట దేవేందర్ గౌడ్ అక్కడే కలుసుకున్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందన, పార్టీ పరిస్థితి, ఇతర రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది. జిల్లాలోని వెంకటాపురం నుండి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. మూడు రోజుల క్రితం షర్మిల పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించిన విషయం తెలిసిందే. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ రోజుతో 39వ రోజుకు చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+