వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు ప్యాలెస్‌లు..: విజయమ్మపై బాబు, కిరణ్‌పై ద్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మెదక్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో నిప్పులు చెరిగారు. అవినీతి మంత్రులను కాపాడుతున్న ఈ ముఖ్యమంత్రిని జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగలను వెనుకేసుకొస్తున్నాడని ధ్వజమెత్తారు. మంత్రులకు అండగా నిలుస్తున్నారన్నారు.

ప్రజలకు ఏం చేశారని కిరణ్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకుంటోందని ప్రశ్నించారు. రుణ మాఫీకి కిరికిరి పెడుతున్నారన్నారు. వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాద రావుపై సిబిఐ చార్జిషీట్ వేయగా.. సిఎం క్లీన్‌చిట్ ఇస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి సిఎం పాలనకు పనికి రాడని, తక్షణం జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు రెండు పార్టీలను గెలిపిస్తే ఇళ్ల కప్పులూ మిగలనివ్వరని హెచ్చరించారు.

జగన్ దోచుకున్న లక్ష కోట్లను స్వాధీనం చేసుకొంటే ఒకటి కాదు.. మూడుసార్లు రుణమాఫీ చేయొచ్చునని స్పష్టం చేశారు. దొంగలూ దోపిడీలూ పోయి రాష్ట్రమూ ప్రజలూ అభివృద్ధి చెందేందుకు టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మీకు ప్యాలెస్‌లు రైతులకు కనీసం రుణమాఫీ కూడా వద్దా వైయస్ విజయమ్మను ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వడ్డీ ఎలా మాఫీ చేయాలో చేసి చూపిస్తానని వైయస్సార్ కాంగ్రెసుకు కౌంటర్ ఇచ్చారు. చార్జిషీట్‌లో మంత్రి పేరును సిబిఐ ప్రస్తావించినా ధర్మాన తప్పు ఏమీ లేద'ని కిరణ్ చెప్పడం విడ్డూరమన్నారు.

తెల్లదొరల పాలనలో జరిగిన దోపిడీకన్నా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎక్కువగా దోచుకున్నారని విమర్శించారు. మద్యం సిండికేట్‌ల వ్యవహారంలో 1100 మంది ఉద్యోగులపై ఎసిబి కేసులు నమోదు చేసిందని, ఈ కేసులో మంత్రుల మాటేమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary

 TD chief Nara Chandrababu Naidu alleged CM Kiran Kumar Reddy should sent to jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X