జైపాల్ తర్వాత మర్రి: ప్రోటోకాల్ వివాదంతో వాయిదా

Marri Shashidhar Reddy
యూఢిల్లీ: మెట్రో రైలు ప్రాజెక్టు గడ్డర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. అది కొనసాగుతుండగానే మరో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అయితే ఈసారి వంతు సనత్ నగర్ ఎమ్మెల్యే, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డిది. ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురయింది.

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 11 గంటలకు కొన్ని నూతన యూనిట్లను ప్రారంభించాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం శశిధర్‌ రెడ్డికి ఆహ్వానం పంపింది. అందులోనూ ఆయన ఢిల్లీలో ఉండగా ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయానికి పంపింది.

దీనిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మర్రి ఓఎస్‌డి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సోమవారం సాయంత్రం 6.26 గంటలకు ఫాక్స్ ద్వారా లేఖ పంపించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో నూతన విభాగాల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాత్రి 7.15 గంటలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి.. మర్రి శశిధర్ రెడ్డి ఓఎస్‌డికి సమాచారం పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+