సిబిఐ విచారణకు జగన్ తరఫున ప్రతినిధులకు ఓకే

దీనికి సోమవారం కోర్టు అనుమతించింది. అయితే ప్రతినిధులు రూ.25వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాద రావు ఉత్తర్వులు వెల్లడించారు. జగతి పబ్లికేషన్స్ తరఫున వైయస్ రాఘవేంద్ర, రఘురాం/భారతి సిమెంట్స్ తరఫున బాలాజీ, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ లిమిటెడ్ తరఫున రమేష్ బాబు, సిలికాన్ బిల్డర్స్ తరఫున వేణుగోపాల రాజులను న్యాయమూర్తి అనుమతించారు.
కాగా తన బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడైన జగతి పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ సాయి రెడ్డి సోమవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదు విడిచి వెళ్లరాదనే నిబంధనలను సడలించాలని ఆయన కోర్టును కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ఇటీవల ఈడి విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లి వస్తున్నారు.
చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఆడిటింగ్ వ్యవహారాలు చూడాల్సి ఉందని, వృత్తిపరమైన బాధ్యతలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని, విధించిన షరతును తొలగించాలంటూ కోరారు. సిబిఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసినపుడు, కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదని షరతు విధించిందని, తన కుమార్తె విద్యావసరాలకు, వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆ షరతును తొలగించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications