హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ని పార్టీలు ఆహ్వానించినా టిడిపిలోకే వెళ్తున్నా: కృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తనకు ఎన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చినా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మంగళవారం చెప్పారు. బుధవారం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో పార్టీ పూర్వ వైభవం కోసం పాటు పడతామని చెప్పారు. తనపై వచ్చిన కేసు విషయంలో 2003లోనే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు. మహారాష్ట్రలో మాత్రమే వర్తించే మాత చట్టాన్ని తనపై కుట్ర చేసి ఆ చట్టం కింద అరెస్టు చేశారని కృష్ణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ సమయంలో చెప్పిందన్నారు. త్వరలో తనపై ఉన్న కేసులు అన్ని క్లియర్ అవుతాయన్నారు. ఎవరో ఇద్దరు తన పేరును ఉపయోగించుకొని కిడ్నాప్ చేసి బంధించిన విషయమే తనపై ఉన్న ప్రధానమైన ఆరోపణ అన్నారు. అవన్నీ త్వరలో క్లియర్ అవుతాయన్నారు.

అనేక పార్టీల నుండి తనకు ఆహ్వానం వచ్చినా టిడిపి రాజకీయ జీవితం ఇచ్చినందున అదే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని కృష్ణ యాదవ్ చెప్పారు. 1994లోని స్వర్ణయుగాన్ని 2014లో అందరం కలిసి తీసుకు వస్తామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు.

English summary
Former Minister Krishna Yadav said he will join in Telugudesam Party on Wednesday in the presence of party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X