హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్: మాట తప్పడమా, ఉసిగొల్పడమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతున్నారా? తాను లేదా తన పార్టీ నేతలు చెప్పిన మాటలనే ఆయన లేదా ఆయన పార్టీ నేతలు విస్మరిస్తున్నారా? తెలుగుదేశం పార్టీని కిరణ్ కుమార్ రెడ్డి పైకి ఉద్దేశ్య పూర్వకంగా ఉసిగొల్పుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెసు ప్రభుత్వంపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావడం లేదని, కుమ్మక్కు అనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు.

జగన్: మాట తప్పడమా, ఉసిగొల్పడమా?

తన తండ్రి అధికారంలోకి తీసుకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టనని చెప్పిన వైయస్ జగన్ ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అవిశ్వాసంపై సవాళ్లు విసురుతున్నారు.

జగన్: మాట తప్పడమా, ఉసిగొల్పడమా?

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో సిబిఐ కేసులో కేంద్రం జోక్యం లేదని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు ఆ తర్వాత, అంతకుముందు కాంగ్రెసు పార్టీయే కుట్రతో జగన్‌ను అరెస్టు చేయించిందని నిప్పులు చెరిగారు.

జగన్: మాట తప్పడమా, ఉసిగొల్పడమా?

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ప్రకటించాక టిడిపి అవిశ్వాసం పెట్టిందనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదనలో పస లేదంటున్నారు. జగన్ బయటకు వెళ్లి కాంగ్రెసుకు సవాల్ విసురుతున్న తొలి నుండే చిరంజీవి కాంగ్రెసుకు అండగా నిలుస్తానని చెప్పారని, అలాంటప్పుడు విలీనం తర్వాత, ముందు అనే దానికి ప్రాధాన్యత లేదంటున్నారు.

జగన్: మాట తప్పడమా, ఉసిగొల్పడమా?

గతంలో టిడిపి అవిశ్వాసం పెడితే తమకు నలబై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జగన్ పార్టీ చెప్పింది. కానీ తీరా చూస్తే ఓటేసింది అందులో సగం కూడా లేదు. అయితే ఆ సమయంలో బేరసారాలు, బ్లాక్‌మెయిల్ జరిగిందని టిడిపి ఆరోపిస్తుంది. ఇప్పుడు కూడా అవిశ్వాసం పెడితే జగన్ బెయిల్ తదితర వాటి కోసం బేరసారాలు జరుగుతాయని అంటోంది.

జగన్: మాట తప్పడమా, ఉసిగొల్పడమా?

తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధంగా లేదు. అయితే అనుకోని పరిస్థితి ఎదురైతే మాత్రం కాంగ్రెసు పార్టీ అధిష్టానం మజ్లిస్ పార్టీ అండను తాత్కాలికంగానైనా మెప్పించి, ఒప్పించి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అన్న వ్యాఖ్యల్ని పలువురు గుర్తు చేస్తున్నారు. తమకు తమ తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని వారే స్వయంగా చెప్పారని అంటున్నారు. అలాంటి ప్రభుత్వంపై నిత్యం అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేయడం కేవలం వ్యూహత్మకమా లేక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని మార్చుకుందా అని ప్రశ్నిస్తున్నారు.

అలా నిర్ణయాన్ని మార్చుకుంటే ఎక్కడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు స్పష్టంగా ప్రకటించినట్లుగా కనిపించలేదని అంటున్నారు. వైయస్ తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చనని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు కూల్చాలని డిమాండ్ చేయడం మాట తప్పడం కాదా అంటున్నారు. అయితే వైయస్ పథకాలు నీరుగార్చుతున్నందువల్లే జగన్ పార్టీ అలా స్పందిస్తుందనేది మరికొందరి వాదన.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపిని కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేయడానికి మూడు కారణాలు ప్రధానంగా ఉన్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు, పార్టీలు చెబుతున్నాయి. ఒకటి సెంటిమెంట్ తగ్గక ముందే ఎన్నికల్లో గెలుపొంది లబ్ధి పొందడం, రెండు ప్రజల దృష్టిని తమ వైపుకు మరింతగా మలుచుకోవడం అంటున్నారు. అవిశ్వాసం డిమాండ్ కేంద్రంతో జగన్ అరెస్టు పైన, బేరాల కోసమేనన్నది తెలుగుదేశం పార్టీ వాదనగా ఉంది. అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసమే ఆ పార్టీ అవిశ్వాసం డిమాండ్ చేస్తోందని టిడిపి చెబుతోంది.

అయితే తండ్రి తీసుకు వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కూల్చనని బహిరంగంగా చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు కూల్చేందుకు ఉబలాటపడటం ఎక్కువ సీట్లు గెలుచుకునే ఉద్దేశ్యంలో భాగంగానే అంటున్నారు. అదే సమయంలో గతంలో ప్రవేశ పెట్టిన అవిశ్వాసాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. టిడిపి అవిశ్వాసం పెడితే తాము కూల్చుతామని, తమకు నలబైకి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన జగన్ వైపు ఆ తర్వాత 17 మంది మాత్రమే వచ్చారని అంటున్నారు.

అంత వేడి సమయంలోనూ జగన్ కూల్చలేక పోయారని, ప్రస్తుతం అప్పుడప్పుడు కొందరు ఎమ్మెల్యేలు దరికి చేరుతున్నంత మాత్రాన ప్రభుత్వాన్ని కూల్చుతామనుకోవడం అపోహ మాత్రమే అంటున్నారు. అదే పరిస్థితి వస్తే ఢిల్లీ పెద్దలు మజ్లిస్‌ను తమ వైపుకు తప్పకుండా రప్పించుకుంటారని అంటున్నారు. అంతేకాకుండా జగన్ జైల్లో ఉన్నారని, వరుసగా అతనికి బెయిల్ విషయంలో చుక్కెదురవుతుందని చెబుతున్నారు.

English summary
YSR Congress party is challenging Telugudesam party for no confidence motion on Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X