హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తెలంగాణ జైలును అమ్మేస్తారు, ఇక్కడొద్దు: కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: తెలంగాణ పేరుతో తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోట్లు వెనుకేసుకున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పడం విడ్డూరంగా ఉందని, కొంత ఓపిక పడితే అంతా బయటకు వస్తుందని, ప్రస్తుతం సిబిఐ దర్యాఫ్తు జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తును ఉద్దేశించి అన్నారు.

సిబిఐ విచారణ జరుగుతోందని, త్వరలో అవినీతిపరులు ఎవరో తేలుతుందన్నారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని కొండా సురేఖకు సూచించారు. నల్గొండ సమరభేరీ సభ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి భయపడి తాము నిర్వహించలేదన్నారు. వారే తమకు భయపడి పాదయాత్రలు చేస్తున్నారని, పాదయాత్రలకు సమాధానంగానే తాము సూర్యాపేట సభను నిర్వహించామని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

షర్మిల తాను జగన్ బాణాన్ని అని చెబుతుంటారని, బాణం అయితే చక్కగా పాదయాత్ర చేసుకొని వెళ్లాలి. అంతేకానీ తమ ఉద్యమ నేతను ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కుసంస్కారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే బాబుకు సంస్కారం నేర్పుకోండని సూచించారు. బయ్యారం గనుల్లో మీ పాత్ర లేకుంటే నిరూపించుకోవాలని షర్మిలకు సవాల్ విసిరారు.

నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్న జగన్‌ను తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. విత్తు ఒకటి అయితే చెట్టు మరొకటి వస్తుందా అన్నారు. వైయస్ వారసత్వం షర్మిలకు వచ్చిందన్నారు. చంద్రబాబు, కాంగ్రెసు పార్టీ పైనా ఆమె నిప్పులు చెరిగారు.

కాళ్లు పట్టుకుంటారో పీక పట్టుకుంటారో

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణను దోచుకున్నారని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కెసిఆర్ నీ కాళ్లు పట్టుకుంటారో పీక పట్టుకుంటారో తేలుతుందన్నారు. జగన్‌ను తెలంగాణ జైలులో ఉంచవద్దని, రాజమండ్రి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి జైలులో ఉంటే జగన్ జైలును కూడా అమ్మేస్తారన్నారు.

English summary
Telangana Jagrithi president Kalvakuntla Kavitha blamed YSR Congress party chief YS Jaganmohan Reddy and Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X