కెసిఆర్ టార్గెట్: వీరి తెలంగాణ రాజకీయ వి'చిత్రాలు'

హైదరాబాద్: నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు టార్గెట్ అయ్యారు. ఢిల్లీ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చిన కెసిఆర్ ఒక్కసారిగా తన పార్టీ కార్యక్రమాన్ని ప్రకటించి జనంలోకి అడుగు పెట్టారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సమరభేరీ పెట్టి అన్ని పార్టీల నాయకుల దృష్టిని తన వైపు తిప్పుకున్నారు.

కెసిఆర్ టార్గెట్: వీరి తెలంగాణ వి'చిత్రాలు'

చాలా కాలం పాటు మౌనంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒక్కసారిగా జూలు విదిల్సారు. సూర్యాపేట సమరభేరీ సభలో చంద్రబాబుపై, వైయస్ రాజశేఖర రెడ్డిపై మాటల ఈటెలు విసిరారు.

కెసిఆర్ టార్గెట్: వీరి తెలంగాణ వి'చిత్రాలు'

కెసిఆర్ సూర్యాపేట సమరభేరీ బహిరంగ సభలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల వాగ్బాణాలు విసిరారు. కెసిఆర్ తమ కాళ్లు పట్టుకోవాలని అన్నారు. తెలంగాణలో తగినన్ని సీట్లు సంపాదిస్తే తప్ప అధికారంలోకి జగనన్నను తేలేమని గుర్తించి, తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఆ బాణాలు వేశారని అంటున్నారు.

కెసిఆర్ టార్గెట్: వీరి తెలంగాణ వి'చిత్రాలు'

ఇక, బిజెపి మహబూబ్‌నగర్ శాసనసభ ఉప ఎన్నిక నుంచి కెసిఆర్‌ను ప్రత్యర్థిగానే భావిస్తోంది. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని తాపత్రయపడుతోంది. అందుకు సుష్మా స్వరాజ్, గడ్కరీ వంటి జాతీయ నేతలను తెలంగాణకు పిలిపిస్తోంది.

కెసిఆర్ టార్గెట్: వీరి తెలంగాణ వి'చిత్రాలు'

తెలంగాణలో తమ బలాన్ని తూకం వేసుకుంటూ చంద్రబాబు పాదయాత్ర సాగిస్తున్నారు. కెసిఆర్‌ను తగ్గిస్తూ తాను బలం పెంచుకోవాలని చూస్తున్నారు. దీంతో కెసిఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. మాటల గారడీ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.

కెసిఆర్ సూర్యాపేట సమరభేరీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిలకు అరికాలి మంట నెత్తికెక్కింది. పైగా, తెలంగాణలో తెరాసను బలహీనపరిచి, ప్రజల ఆదరణ పొందడానికి ఇద్దరు కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఈ స్థితిలో కెసిఆర్‌ మాటలపై వారు విరుచుకపడ్డారు.

మరోవైపు, బిజెపి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తెరాసను తెలంగాణలో ఢీకొనేందుకు సిద్ధపడుతోంది. ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం తెలంగాణ జెఎసి ముప్పు తిప్పలు పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+