సిఎం పదవి కోసమే ఢిల్లీలో కెసిఆర్: వరవర రావు

అంతకుముందే పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లినా తర్వాత కూడా వెంటనే తిరిగి రాలేదని గుర్తు చేస్తూ మరాయన ఆ సమయంలో హస్తినలో ఎందుకు ఉన్నట్లు అని ఆయన అడిగారు. కెసిఆర్ ఢిల్లీలో ఉన్నది తెలంగాణ సాధన చర్చల కోసం కాదని, మార్చ్‌ను నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశపెట్టడం వల్లేనని తన మిత్రుడు చెప్పినట్లు ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం కెసిఆర్, కోదండరాం మొదట్లో చూపించిన వాడి వేడి ఇప్పుడు చూపించడం లేదని అన్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఆశ చూపి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చినట్లే కెసిఆర్‌నను కూడా ప్రలోభపెట్టారని తన మిత్రుడొకరు తనకు చెప్పినట్లు వరవరరావు వివరించారు.
భారత విప్లవోద్యమ నిర్మాత చండ్ర పుల్లారెడ్డి 28వ వర్ధంతి సభ మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడారు. బాల్ థాకరే లాంటివాళ్లు వస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే వాదన వినిపిస్తోందని, ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. కిషన్‌రెడ్డి పక్కన ఉన్నవారు ఆయనను బాల్ థాకరేలా రూపొందించాలని చూస్తున్నారని వరవరరావు అన్నారు.
సామ్రాజ్యవాదశక్తుల ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని తెస్తోందని ప్రొఫెసర్ ప్రొ. హరగోపాల్ ఆరోపించారు. ఇది మన దేశ విధానాలకు సరిపోదని, ప్రజలు మరింత దారిద్య్రానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications