జగన్‌పై తీర్పు 4కు వాయిదా, జైల్లో కల్సిన ఇంద్రకరణ్

దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఢీలా పడింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైననే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఈసారైనా తప్పకుండా బెయిల్ వస్తుందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాగా సిబిఐ సిబిఐ తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శుక్రవారం కడప జిల్లా పులివెందులలో నిరసన తెలిపింది. వైయస్సార్ విగ్రహం వద్ద సిబిఐ తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెసు కనుసన్నుల్లో సిబిఐ నడుస్తోందని వారు ఆరోపించారు. సిబిఐ దర్యాఫ్తు దారి తప్పిందని నిప్పులు చెరిగారు. నల్ల బ్యాడ్జీలను ధరించి ఆందోళన చేశారు.
మరోవైపు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కన్నప్ప కలుసుకున్నారు. వీరు ఇటీవల కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications