వైయస్ జగన్ పార్టీలోకి దూకుళ్లకు బ్రేక్‌లు

అయితే, వైయస్ జగన్ పార్టీలోకి ఊహించినంతగా వలసలు జరగడం లేదని అంటున్నారు. చేర్చుకునే వారికి, చేరాలనుకునే వారికి స్పష్టత లేకపోవడమే వలసలకు ఆగిపోవడానికి కారణమని అంటున్నారు. పార్టీలో చేరాలని అనుకుంటున్నవారికి వైయస్ జగన్ నుంచి తగిన హామీలు లభించడం లేదని, అందువల్ల కొంత మంది పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. వచ్చి చేరితే చూద్దామనే పద్ధతిలో వైయస్ జగన్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
ఇంద్రకరణ్ రెడ్డి వంటి వాళ్లు ముందుగానే ఒక హామీని పొంది చేరారనే మాట వినిపిస్తోంది. జిట్టా బాలకృష్ణా రెడ్డికి కూడా భువనగిరి సీటు ఇస్తామనే హామీ లభించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమను మోసం చేశారని భావిస్తున్న కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి వంటి నాయకులు పార్టీలోకి తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు, తెలంగాణవాదం వల్ల కూడా జగన్ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నవారికి బ్రేకులు పడుతున్నాయని చెబుతున్నారు. వైయస్ జగన్ పార్టీలో చేరాలని భావిస్తున్న నాయకులపై తెలంగాణవాదులు ఓ కన్నేసి ఉంచారని అంటున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే, తెలంగాణవాదులు వాళ్ల ఇళ్ల ముందు ధర్నాలు చేశారు. ఇటువంటి పరిస్థితే తమకు ఎదురవుతుందేమోనని కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి వెనకాడుతున్నట్లు చెబుతుననారు.
మొత్తం మీద, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పినంత వలసల జోరు ఉండదని అంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ఇవ్వకపోవడమే వలసలు పెరగకపోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాత్రం గాలం వేయడం మానుకోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications