రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానంతో భార్య హత్య: భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
రాజమండ్రి: భార్యను చంపిన ఓ భర్తపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనుమానంతో భార్యను చంపిన ఓ భర్తకు కోర్టు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. జిల్లాకు చెందిన అల్లవరం మండలం గోపాయలంక గ్రామానికి చెందిన వీరభద్ర రావు అనే వ్యక్తి తన భార్య సీతామహాలక్ష్మిని అనుమానంతో రోకలి బండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఇది 2010 ఫిబ్రవరిలో జరిగింది.

సీతామహాలక్ష్మి మృతిపై పోలీసులకు కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీంతో వాదనలు పూర్తయిన అనంతరం జిల్లా జడ్జి రాజు వీరభద్ర రావుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే హైకోర్టుకు వెళ్లే వెసులుబాటును వీరభద్ర రావుకు అమలాపురం జడ్జి కల్పించారు.

విద్యార్థిని మృతి

ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలో ఓ టిప్పర్ ఢీకొని విద్యార్థిని మృతి చెందింది. కొత్తగూడం మండలంలోని పెనుగడప సమీపంలో ఇది చోటు చేసుకుంది. అమ్మాయి కాలేజీకి వెళ్తుండగా ఇది జరిగింది.

భద్రాచలంలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలపై అటవీశాఖ ఉద్యోగిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని రిక్షా కాలనీలో ఇంటి వద్దనున్న ఉద్యోగిని అదే కాలనీకి చెందిన కొందరు బయటకు తీసుకు వెళ్లి చంపేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

English summary
Amalapuram court has commuted the death sentence for a husband accused of killed his wife in 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X