చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత: తెలంగాణ సెగ

చంద్రబాబు పట్టు వీడకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతోంది. వారు వారించినా చంద్రబాబు వినడం లేదు. ఆయన పాదయాత్ర శనివారం నిజామాబాద్ జిల్లాలో నాలుగో రోజు కొనసాగింది. ఇదిలావుంటే, ఆయనకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను విమర్శించే సందర్భంలో తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పారు. జిల్లాలోని బీర్కూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఉద్యమం పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి మోసం చేస్తోందని చంద్రబాబు చేసిన విమర్శకు తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పారు. మీరు మోసం చేయడం లేదా అని తెలంగాణవాదులు అడిగారు. తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
బీర్కూర్ సభలో చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి సొమ్ముతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ప్రజల సొమ్ముతో తెరాస పత్రికలు, టీవీ చానెళ్లు పెట్టాయని ఆయన విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు.
తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications