సోనియాతో నేను చెప్పడం వల్లే ప్లాన్: చిరంజీవి

బలహీనవర్గాల అత్యున్నత జీవితాలకు, సామాజిక సమానతకు ఈ ప్లాన్ తొలి మెట్టు అని ఆయన అన్నారు. తాను కలలు కన్న సామాజిక న్యాయం కాంగ్రెసు వల్లనే సాధ్యమవుతుందని నిరూపితమైందని ఆయన అన్నారు. తన నమ్మకాన్ని కాంగ్రెసు పార్టీ నిలబెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో చర్చకు పెట్టడం పట్ల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లకుండా వారికే ఖర్చు చేయాలని తాను శానససభలో ఉండగా చాలాసార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికే ఖర్చు చేయాలని తాను సోనియాకు విలీనం ప్రతిపాదన సమయంలో చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను శానససభలో చర్చకు పెట్టడం చాలా సంతోషంగా ఉందని, ఆ సంతోషాన్ని పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.
ఎస్సీ, ఎస్టీ ప్లాన్‌పై చర్చలో రాజకీయాలు మాట్లాడడం పార్టీలకు తగదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీల జీవిత ప్రమాణాలు పెంచడానికి అవసరమైన చర్చ చేయాలని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడమనేది చారిత్రక విజయమని ఆయన అన్నారు. అలా చెప్పుకోవడం రాజకీయం కాదా అని అడిగితే చేసింది చెప్పుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. గతం ఏమిటనేది వదిలేసి భవిష్యత్తు మీద దృష్టి సారిద్దామని ఆయన అన్నారు. ఇక ముందు తప్పులు జరగకూడదని ఆలోచించాలని ఆయన అన్నారు.
సోనియా గాంధీ ఏం చేసినా బలహీనవర్గాలను దృష్టిలో పెట్టుకునే చేస్తుందని చిరంజీవి అన్నారు. బిసీ, మైనారిటీల విషయంలో ఇటువంటి చట్టబద్దమైన ప్రణాళికలు తేవడం అవసరమని, ఆ దిశగా కూడా ఆలోచన సాగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఉప ఎన్నికలు ప్రామాణికం కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ల వంటివి పని చేస్తాయని, సాధారణ ఎన్నికల్లో అలా ఉండదని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందనేది ఇప్పుడు అప్రస్తుతమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications