ఖైదీలకు రూ. 50, విద్యార్థులకు రూ. 17: హరీష్

Harish Rao
హైదరాబాద్: రోజుకు ఖైదీలకు 50 రూపాయలు, ఆస్పత్రి రోగులకు 40 రూపాయలు ఇస్తూ హాస్టల్ విద్యార్థులకు 17 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు హాస్టళ్లు వదేలిసి వెళ్తున్నారని, దానివల్ల చదువకు దూరమవుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శానససభ్యుడు హరీష్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై చర్చను ఆయన శనివారం ప్రసంగించారు. ప్రభుత్వ తీరు వల్ల చదువుకు దూరమవుతున్నారని ఆయన విమర్శించారు. దళిత, గిరిజన చట్టాలు బలహీనంగా ఉన్నాయని ఆయన అన్నారు.

చిత్తశుద్ధి లేకుండా ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు జీతాలు పెరిగాయని, విద్యార్థుల మెస్ చార్జీలు మాత్రం పెంచడం లేదని ఆయన అన్నారు. హాస్టళ్ల మూసివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ బిల్లులో సవరణలు అవసరమని, అలా చేయకపోతే ప్రభుత్వం గతంలో చేసిన తప్పులే మళ్లీ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. విద్యార్థులకు హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని ఆయన అన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లుకు ఆయన సవరణలు సూచించారు. ఎస్సీ, ఎస్టీ నిధుల వ్యయానికి నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు పెట్టడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించాలని ఆయన సూచించారు. మాటలు కోటలు దాటుతున్నాయని గానీ ఆచరణ మాత్రం లేదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు 60 శాతం నేరుగా లబ్ధిదారుకు అందేలా పథకాలను రూపందించి అమలు చేయాలని, అప్పుడే ఆ నిధుల సక్రమ వినియోగం జరుగుతుందని ఆయన అన్నారు.

సాధారణ పథకాల ద్వారా ఖర్చు పెడతామంటే న్యాయం జరగదని, గ్రూపులను గుర్తించి వాటికి పథకాలు అందేలా చూడాలని ఆయన అన్నారు. జలయజ్ఞంలో నిధులు చేర్చి దళితుల కోసం ఖర్చు పెడతామంటే న్యాయం జరగదని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లు అయినా దళితులు, గిరిజనుల బతుకులు మారలేదని ఆయన అన్నారు. ఉప ప్రణాళికకు చట్టబద్ధతతో పాటు నిబద్ధత కూడా అవసరమని ఆయన అన్నారు. దారి మళ్లిన 21 వేల కోట్ల రూపాయలను సమీకరించి దళితులకు న్యాయం చేయాలని ఆయన సూచిచారు. ఉప ప్రణాళికకు కాలపరిమితి పెట్టడం సరైంది కాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+