కాంగ్రెసు మోసం చేసింది, ఎన్డీఎను నమ్ముదాం: కెసిఆర్

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సమావేశానంతరం ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. డిసెంబర్ 23వ తేదీన విద్రోహదినాన్ని పాటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నల్లజెండాల ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 9వ తేదీని స్ఫూర్తిదినంగా పాటిస్తామని, కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శన జరుగుతాయని ఆయన చెప్పారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు తెలంగాణ తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకాభిప్రాయం వ్యక్తం చేయాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. విద్రోహమా, తెలంగాణ ప్రజలతో భాగస్వామ్యమా రాజకీయ నాయకులు తేల్చుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధుల నియోజకవర్గాల్లో ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో సమైక్యవాదానికి స్థానం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రుల గుప్పిట్లో ఉందని ఆయన విమర్శించారు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
కాగా, కెసిఆర్, బిజెపి నేతలు పాల్గొన్న సమావేశంలోనే తెలంగాణ జెఎసి నేతలు ఆ రెండు పార్టీల తీరును తప్పు పట్టారు. ఇరు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఒక ఒప్పందానికి రావాలని వారు సూచించారు. రెండు పార్టీలు పోటీ చేస్తే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.












Click it and Unblock the Notifications