చిరు ప్రెస్ మీట్ వివాదాస్పదం: స్పీకర్ ఆంక్ష బేఖాతరు

అయితే శనివారం చిరంజీవి మీడియా సమావేశం ఒకటి వివాదాస్పదమైంది. కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రిగా(స్వతంత్ర హోదా)లో ఉన్న చిరంజీవి కోసం ఈ నిబంధనలు ఉల్లంఘించారు. చిరంజీవి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అనంతరం ఆయన కాంగ్రెసు పార్టీ శాసనసభా కార్యాలయానికి(సిఎల్పీ) వెళ్లారు. అసెంబ్లీలో ఉన్న ఓ అధికారి స్వయంగా సమావేశాలు జరుగుతున్నప్పుడు మీడియా ఫోటో గ్రాఫర్లను లోపలకు తీసుకు వెళ్లారు.
పోలీసు ఉన్నతాధికారులు అడ్డు చెప్పినప్పటికీ వారిని లోనికి తీసుకు వెళ్లారు. మీడియా లోపలకు రావడంతో స్పీకర్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత సభ వాయిదా పడకముందే.. చిరంజీవి సిఎల్పీ కార్యాలయంలో జరిపిన విలేకర్ల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మీడియాకు అనుమతించారు. స్పీకర్ జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కారని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications