జగన్‌తో రాజీ: అలాంటిదేం లేదన్న రాహుల్ సభ్యుడు

కాగా రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై, లోకసభ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకు గాను తన ప్రతినిధులు ఇద్దరిని రాష్ట్రానికి పంపించారు. రాహుల్ గాంధీ ప్రతినిధులు జితేందర్ దేశ్‌ముఖ్, విశ్వజిత్ రాణే రాష్ట్రానికి వచ్చారు.
రాహుల్ గాంధీ ప్రతినిధులు శనివారం నాడు కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వారు ఆరా తీశారు. జగన్ బలాబలాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్‌తో రాజీకి వస్తే లాభమా, నష్టమా అని అడిగారు. వైయస్ జగన్‌తో రాజీకి వస్తే మంచిదని కొంత మంది సూచించినట్లు తెలుస్తోంది.
జగన్‌తో రాజీ గురించి వారు ప్రత్యేకంగా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. సిబిఐ కేసులు ఎత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వైయస్ జగన్ రాజీకి వస్తాడేమోనని జెసి దివాకర్ రెడ్డి వారితో అన్నారు. లోకసభ స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటీకి దింపాలని ఆయన సూచించారు. కాగా జగన్ విషయ ప్రస్తావన అంశాన్ని ఎంపి రాయపాటి, జెసి దివాకర్ రెడ్డిలు ఖండించారు.












Click it and Unblock the Notifications