గెలిచినా కష్టాలు: జగన్‌పై జెసి, ఆయన పేరే జగన్‌కాంగ్రెస్

ఆ తర్వాత జెసి మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు 2014 తర్వాత సంవత్సరం పాటు సంతోషంగా ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఏడాది సంతోషంగా ఉన్నా ఆ తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతకుముందు జెసి దివాకర్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కమిటీ ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వస్తారని రాహుల్ టీం పరిశీలకులకు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. కాంగ్రెసు కంటే ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉందన్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వస్తే ఒక్కరు కూడా పార్టీలో మిగులరని చెప్పారు. సిబిఐ కేసులు ఎత్తివేసి, ముఖ్యమంత్రిని చేస్తామంటే జగన్ వస్తాడన్నారు. అనంతపురం, హిందూపురం లోకసభ స్థానాలకు అభ్యర్థులపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని చెప్పారు.












Click it and Unblock the Notifications