షర్మిలకు తెలంగాణ సెగ: జై తెలంగాణ అన్న పార్టీ నేత

ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జై జగన్ అని నినాదాలు చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన బిసి సెల్ నేత ఒకరు జై తెలంగాణ అన్నారు. అయితే తెలంగాణవాదులు మీరు మాత్రమే కాదని... షర్మిల చేత అనిపించాలని డిమాండ్ చేశారు. షర్మిల జై తెలంగాణ అనాలని డిమాండ్ చేస్తూ... జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
కాగా పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ...ప్రజలు ఇన్ని సమస్యలతో బాధపడుతుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో కావడమే అందుకు కారణమన్నారు.
ప్రాణాలు చాలా విలువైనవని వాటిని పోగొట్టుకోవద్దని కోరారు. పోరాడి ఏదైనా సాధించుకోవాలని సూచించారు. ఒక్క ఏడాది ఓపికపడితే జగన్ అధికారంలోకి వస్తాడని, రాజన్న రాజ్యం తీసుకు వస్తాడని హామీ ఇచ్చారు. గుడిసెలు లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారన్నారు.












Click it and Unblock the Notifications