కిరణ్, బొత్స మధ్య తాజా చిచ్చు: అసమ్మతి భేటీ

మద్యం ప్రియులపై భారం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో మద్యం ధరల పెంపును ఉపసంహరించుకోవాలని సీఎం కిరణ్‌కు బొత్స లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దాంతో పెద్ద యెత్తున మద్యం ధరలు పెరిగాయి. ఈ విషయంపై బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానానికి కూడా విన్నవించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాయకీయాలపై చర్చించినట్లు తెలియవచ్చింది. రాష్ట్రంలోని సమస్యలను అధిష్టానానికి వివరించేందుకు వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా, మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతించకూడదని మంత్రి వర్గం నిర్ణయం చేయడాన్ని వ్యతిరేకించిన డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా ఇటీవల బొత్స సత్యనారాయణ వెనకేసుకొచ్చారు. మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు మంత్రులకు ఉంటుందని ఆయన అన్నారు. ఈ రకంగా మరోసారి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ చిచ్చు రేపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications