యూపి హ్యాండ్: తెలంగాణ ఎంపీలకు అధిష్టానం పిలుపు

ఎంపీలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, పోరిక బలరామ్ నాయక్‌లకు కూడా పిలుపు వెళ్లింది. ఎఫ్‌డిఐలను ప్రతిపక్షాలతో పాటు యూపిఏలోను బయటి నుండి మద్దతు ఇస్తున్న పలు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎఫ్‌డిఐలపై కాంగ్రెసు ఆందోళన చెందుతోంది. ఇతర పార్టీలతో పాటు తెలంగాణ వాదం వినిపిస్తున్న ఎంపీలు గైర్హాజరు కాకుండా ఉండేందుకు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టింది.
యూపి హ్యాండ్
ఎఫ్‌డిఐల అంశంపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అధికార సమాజ్ వాది పార్టీ, ప్రతిపక్ష బహుజన్ సమాజ్ పార్టీలు చివరి నిమిషంలో కాంగ్రెసుకు హ్యాండిచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) కూడా ఎస్పీ, బిఎస్పీ దారిలోనే నడిస్తే గండం తప్పదు. వివిధ పార్టీలను తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు కాంగ్రెసు పార్టీ చేస్తోంది.
ఎఫ్‌డిఐలను తాము వ్యతిరేకిస్తున్నామని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. లోకసభలో దీనినే తాము స్పష్టం చేస్తామని చెప్పారు. ఎఫ్‌డిఐల వల్ల కీడు జరుగుతుందని బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఎస్పీ వ్యతిరేకిస్తోందని, తాము కూడా సమర్థించేది లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications