జగన్ 'సాక్షి'పై కిరణ్ విసుర్లు: క్రికెట్ ఎందుకాడానంటే..

అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ చేతలను ప్రజలు చేబితే నమ్మాలి. అంతేకాని 'సాక్షి' చెబితే కాదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ బిల్లుకు ఎవరు అడ్డు వచ్చినా ఆగేది లేదని నిర్ణయించుకున్నామని, అందుకే సభలో ధీమాగా ప్రవేశ పెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధి చేయాలనే తపన కాంగ్రెసు పార్టీకి ఉందన్నారు. తాము ఈ బిల్లు రాజకీయాల కోసం తీసుకు రాలేదన్నారు.
వారి అభివృద్ధి కోసమే తెచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిసిలకు తాము న్యాయం చేశామని చెబుతున్నారని, అవన్నీ అవాస్తవాలు అన్నారు. బిసిలకు కాంగ్రెసు హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. బిసి సబ్ ప్లాన్ బిల్లుపై ఆలోచిస్తామన్నారు. ఇందిర బాట కార్యక్రమం ఇది తనకు పదో జిల్లా అని, ఈ రోజు హాస్టల్లోనే పడుకుంటానని చెప్పారు. తాను గతంలో పిల్లలతో క్రికెట్ ఆడితే తప్పు పట్టారని, అది తన పొరపాటే అన్నారు.
అయితే తాను ఎందుకు అలా ఆడానో అర్థం చేసుకోవాలన్నారు. వారిలో ఉత్సాహాన్ని నింపి ప్రోత్సాహం ఇచ్చేందుకే ఆడానని చెప్పారు. అలా చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అవసరమైతే కేబినెట్ విస్తరణ చేస్తామన్నారు. సబ్ ప్లాన్ బిల్లును విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేశాయన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications