నిన్నూ.., 'బాబు'తో జాగ్రత్త!: బాలకృష్ణకు నాని వార్నింగ్

ఎన్టీఆర్ టిక్కెట్ ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించిన రావి కుటుంబం ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారి వైపుకు వెళ్తోందన్నారు. ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై నాని తీవ్రంగా స్పందించారు. నీ కుటుంబాన్ని, నీ పార్టీని కాదని కాంగ్రెసు పార్టీలోకి వెళ్లి కేంద్రమంత్రిగా ఎదిగిన దగ్గుపాటి పురంధేశ్వరి, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెడితే ఉప ఎన్నికల్లో టిడిపిని ఓడించిన షర్మిల, విజయమ్మలు గాజులు తొడుక్కున్న వారే అన్నారు.
ఎన్టీఆర్ చెల్లెల్లుగా భావించే రాష్ట్ర మహిళలు గాజులు తొడుక్కున్న వారే అన్నారు. గుడివాడ తన సొత్తు అని ఎప్పుడూ చెప్పలేదని, తన తండ్రి రాజకీయాల్లో లేడన్నారు. ఎన్టీఆర్‌ను నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆయన అభివృద్ధి చేసిన వ్యక్తి అన్నారు. నన్ను బాలకృష్ణ హెచ్చరించడం మానివేసి.. తనకు పట్టిన గతి పట్టకుండా బాలకృష్ణ చూసుకోవాలని హితవు పలికారు. జాగ్రత్తగా ఉండాలన్నారు.
ద్రోహులను పక్కన పెట్టుకొని తనను విమర్శించవద్దన్నారు. పశువుల్లా అమ్ముడుపోయారని చంద్రబాబు అన్నంత కాలం తాను ఆయనపై నిప్పులు చెరుగుతూనే ఉంటానని చెప్పారు. జగన్ తనను గుడివాడ నుండి పోటీ చేయమని చెప్పారన్నారు. జగన్‌ను జైలులో పెట్టించి వీరు పాదయాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఎప్పుడో ఓసారి జైలు నుండి బయటకు వచ్చి వీరి గుండెలు పగులగొట్టక తప్పదన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు బుద్ధి చెప్పగల నేత జగన్ మాత్రమే అన్నారు.


Click it and Unblock the Notifications