తెలంగాణ సెగ: షర్మిలపై రాళ్లు, ఆగిపోయిన పాదయాత్ర

విద్యార్థులు రాళ్లు, టమాటాలు రువ్వడంతో షర్మిల కొద్ది దూరం వరకు పాదయాత్రను ఆపేసి కారులో వెళ్లారు. పోలీసులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు షర్మిలకు, షర్మిల కాన్వాయ్ పైన రాళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు షర్మిలకు ఎంతగా భద్రత ఏర్పాటు చేసినా విద్యార్థులు మాత్రం తగ్గలేదు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ గొంతెత్తారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారటంతో షర్మిల పాదయాత్రకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది.
కాగా విద్యార్థులు షర్మిల పైన దాడి చేయడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కడా విద్యార్థులపై ప్రతిదాడికి దిగినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలు పలువురు విద్యార్థులపై చేయి చేసుకున్నట్లుగా సమాచారం. పోలీసులు కూడా విశ్వవిద్యాలయంలోకి వెళ్లి విద్యార్థులను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు పాలమూరు విశ్వవిద్యాలయం ముఖ ద్వారం వద్ద షర్మిల దిష్టి బొమ్మను వేలాడదీశారు.












Click it and Unblock the Notifications