హోటల్లో బెయిల్ డీల్: ఎమ్మెల్యే కార్డ్‌తో సోమశేఖర బస

ఎసిబి కోర్టుకు నివేదించిన దాంట్లో దసపల్లా హోటల్ నుంచి సేకరించిన ఆధారాలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా దసపల్లా హోటల్ సిబ్బందిని విచారించిన ఎసిబి మొదటి కేసులో గాలిని ఏ-9గా చేరుస్తూ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌లో వారిచ్చిన వాంగ్మూలాల్ని జతచేసింది. డీల్ వ్యవహారం మొదటి నుంచి హోటల్‌లో ఎవరెవరు బస చేశారు, వారిని కలిసేందుకు ఎవరొచ్చారనే అంశాలపై ఆరా తీసింది.
నిందితులు చెప్పిన వివరాలను సిసి కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా సరి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2012 ఏప్రిల్ 12న హోటల్‌కొచ్చిన సోమశేఖర్ రెడ్డి రూం తీసుకునే సమయంలో గుర్తింపు కార్డుగా బళ్లారి ఎమ్మెల్యే ఐడి కార్డును చూపించారట. ఆ తర్వాత మే 9 నుంచి 13 వరకు జిడిఆర్ రెడ్డి, తిరుపతి చిరునామాతో దశరథరామి రెడ్డి కుటుంబ సభ్యులతో సహా 301, 305 గదుల్లో బస చేసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications