జర్మనీ బూట్లతో పాదయాత్రనా: షర్మిలపై అనురాధ

వైయస్సాక్ కాంగ్రెసు నాయకుల దగ్గర ఏ విషయంలోనూ నిజాయతీ లేదని దీంతో తెలుస్తోందని అనురాధ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎంతమంది అధ్యక్షులో తెలియడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. విజయలక్ష్మి గౌరవాధ్యక్షురాలని, జగన్ గౌరవం లేని అధ్యక్షుడని, షర్మిల వాచింగ్ (గమనిస్తున్న) అధ్యక్షురాలని, భారతి వెయిటింగ్ (వేచి ఉన్న) అధ్యక్షురాలని, ఇందరి నడుమ ఆ పార్టీని నడిపేదెవరో వారికే తెలియాలని ఆమె అన్నారు.
లాలూచీలో భాగంగానే వైయస్ జగన్ కేసులకు సంబంధించిన జీవోల జారీలో తప్పులు జరగలేదని మంత్రులు అఫిడవిట్లు దాఖలు చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. జీవోల జారీలో తప్పులు జరగకపోతే మోపిదేవి అరెస్టు, ధర్మానపై చార్జిషీటు దాఖలు ఎలా జరిగాయని తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.
వాన్‌పిక్ భూ సేకరణలో అనేక అక్రమాలు జరిగాయని సీబీఐ విచారణలో తేల్చిందని, దీంతో ధర్మాన రాజీనామా చేశారని, జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవిలకు బెయిల్ రాలేదని, అయినా, మంత్రులు తమ తప్పేమీ లేదంటూ కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. మంత్రుల అఫిడవిట్ల ద్వారా జగన్‌ను బయటకు తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని వారు సందేహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications