పట్టింపు లేదు: కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన షర్మిల

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పాలమూరు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమరించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఒక్కనాడైనా నియోజకవర్గ ప్రజల ముఖం చూశారా, వారి సమస్యలపై ఏనాడైనా పోరాడారా అని ప్రశ్నించారు.
పాలమూరు యూనివ ర్శిటీ కట్టించిన ఘనత వైఎస్‌దేనని, జిల్లా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పైకి రావాలని వైఎస్ కలలు కనేవారని అన్నారు. యూనివర్శిటీలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారంటే అది వైఎస్ కృషేనని చెప్పారు. కరువు జిల్లా అయిన పాలమూరును పచ్చని పసిడి జిల్లాగా మార్చాలని వైయస్ రాజశేఖర రెడ్డి రూ. 7వేల కోట్లతో 4 ప్రాజెక్టులు నిర్మించారని, ఆయన బతికున్నప్పుడే 70 శాతం పనులు పూర్తి చేయగా ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లయినా 30 శాతం పనులు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి్ రెండోసారి ఎన్నికలకు వెళ్లినపుడు పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలని తలచారని, రూ.10 వేల కోట్లతో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 వేల ఎకరాలకు నీరందించాలని హామీ ఇచ్చారని, వైయస్ కష్టంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైయస్ హామీని పట్టించుకోకుండా ప్రాజెక్టును పక్కన పెట్టిందని దుయ్యబట్టారు.
మహబూబ్‌నగర్ ప్రజల దాహార్తిని తీర్చే కోయిల్‌సాగర్ నీళ్లు తీసుకొచ్చేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. 80 శాతం పనులు పూర్తికాగా మిగిలిన 20 శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని, పాలమూరు తాగునీటి ఎద్దడి పాపం ప్రస్తుత ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications