గాలి బ్రదర్స్‌కు ఈడి షాక్: 884 కోట్ల ఆస్తుల జప్తు

గాలి సోదరుల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడి బుధవారం కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ప్రకటన విడుదల చేసింది. 2007 నుంచి 2010 వరకు మూడేళ్ల పాటు అక్రమాలకు పాల్పడి, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడి తేల్చింది. అసోసియెటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కేసులో బెంగళూర్ కోర్టు బుధవారం గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు నిరుడు సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బంధువు, ఒ ఎంసి డైరెక్టర్ డివి శ్రీనివాస రెడ్డిని కూడా అరెస్టు చేశారు. నేరపూరిత కుట్ర సెక్షన్లు, మోసం, అవినీతి నిరోధక చట్టం కేసుల కింద వారిని సిబిఐ అధికారులు అరెస్టు చేసి హైదరాబాదుకు తరలించారు.
ఆ తర్వాత ఎఎంసి కేసులో కూడా సిబిఐ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో అతని వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్, ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను సిబిఐ అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications