తెలంగాణపై ఆల్‌పార్టీకి హామీ: ఊరటనా, అవసరమా?

పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని షిండే హామీ ఇచ్చారని ఎంపీలు చెప్పారు. కేంద్రం హామీ ఇవ్వడంతో తాము ఎఫ్‌డిఐ ఓటింగులో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు. త్వరలో అఖిల పక్ష భేటీ తేది నిర్ణయిస్తాని చెప్పారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం లేదని కేవలం తెలంగాణ సాధన కోసమే తమ ఒత్తిడి అంతా అని వారు చెప్పారు.
కాగా తెలంగాణపై షిండే అఖిల పక్ష హామీ వారి అవసరంగా కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్‌డిఐ ఓటింగు నుండి గట్టెక్కేందుకే అఖిలపక్ష సమావేశం అని చెబుతున్నారని అంటున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత వరుసగా నెల రోజులకు పైగా అప్పుడప్పుడు వరుస సెలవులు వస్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న షిండే వ్యాఖ్యలు వట్టివే కావొచ్చంటున్నారు.
సమావేశాలు 20వ తేదిన ముగుస్తాయని, ఆ తర్వాత క్రిస్‌మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం... ఇలా వరుసగా పలు సెలవు దినాలు వెళ్తాయని, అప్పటి వరకు అఖిలపక్ష భేటీని వారు మూలన పడేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెసు ఎంపీలు మాత్రం కేంద్రం తమ హామీని నిలబెట్టుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications