ఎన్టీఆర్ విగ్రహానికి మోక్షం: పురంధేశ్వరికి స్పీకర్ లేఖ

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు పురంధేశ్వరిని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూతురు కేంద్రమంత్రి అయి ఉండి విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశలో చర్యలు చేపట్టక పోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తే తామే నిధులు సమకూర్చుతామని, ఈ దిశలో పురంధేశ్వరి కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పారు. అయితే ఇదే విషయంలో పురంధేశ్వరి మాత్రం మొదటి నుండి సైలెంట్‌గా వెళ్తున్నారు. ఆమె కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం తనవంతు ప్రయత్నాలు చేశారు. లేఖలు రాశారు. తాజాగా స్పీకర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పురంధేశ్వరికి ఊరట కలిగిందనే చెప్పవచ్చు.
కేంద్రం తెలంగాణ విషయంలో ఈ నెల 28న అఖిల పక్ష సమావేశానికి కూడా ఈ రోజే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఎంపీల ఒత్తిడి మేరకు అధిష్టానం దిగి వచ్చి అఖిల పక్ష సమావేశానికి సిద్దపడ్డారు. ఇదే రోజు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు కూడా స్పీకర్ అనుమతించడం చూస్తుంటే పార్టీ అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications