హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ బెయిల్ పిటిషన్ స్వీకరణ: సిబిఐకి నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. తన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని జగన్ హైకోర్టులో నిన్న సవాల్ చేశారు. కోర్టు దానిని స్వీకరించి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 13వ తేదికి వాయిదా వేసింది.

కాగా రెండు రోజుల క్రితం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్‌కు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల క్రితం స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు మంగళవారం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది. విచారణ సాగుతోందని, కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయన్న సిబిఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై జగన్ హైకోర్టుకు వెళ్లే అవకాశముంది.

జగన్ ఇరవై క్రితం స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్న, అరెస్టు అక్రమం కాదన్న సిబిఐ వాదనతో ఏకీభవించి ఆయన బెయిల్‌ను తిరస్కరించింది. జగన్ కేసులో తాము సుప్రీం ఆదేశాలను పాటించామని తెలిపింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.

దీంతో జగన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గడప తొక్కారు. స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ తీర్పు 11వ తేదికి వాయిదా పడింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కూడా తిరస్కరించడం, జగన్ హైకోర్టుకు వెళ్లడం, అది ఈ నెల 13వ తేదికి వాయిదా పడటం జరిగింది.

English summary
High Court of Andhra Pradesh has issued notices to CBI in YSR Congress party chief YS Jaganmohan Reddy's bail petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X