కొత్త బ్యాచ్ సాలిడ్ హిట్ కొట్టేశారోచ్.. బొమ్మ బ్లాక్ బస్టర్ !!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో విభిన్న పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజు వారు రాణిగారు సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే 'క ', కే ర్యాంప్ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఓవైపు హీరోగా మార్కెట్ పెంచుకుంటూనే.. మరోవైపు నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం నిర్మాతగా KA పేరుతో ప్రొడక్షన్స్ హౌస్ ప్రారంభించారు. అందులో భాగంగానే నూతన నటీనటులతో పాటు నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". ఈ చిత్రంలో సాయి తేజ్ హీరోగా, వేద హీరోయిన్‌గా నటించగా.. మునిరాజు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉంది ? రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..
తిమ్మరాజుపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో 90వ దశకంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ప్రతీ శివరాత్రికి టీవీ అద్దెకు తెచ్చుకుని సినిమాలు చూడటం ఒక పెద్ద పండుగలా ఉంటుంది. చిన్నపాటి దొంగతనాలు చేసే సతీష్ (సాయితేజ్) ఆ టీవీని అద్దెకు తీసుకొస్తుంటాడు. అయితే ఆ సమయంలోనే రాజప్ప (ప్రదీప్ కొట్టే) తన కట్నం డబ్బుతో మొదటిసారి టీవీ కొని ఆ ఊరికి తీసుకొస్తాడు. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశమవుతుంది. టీవీ కోసం ఊరంతా అతని ఇంటికి చేరడం.. అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అదే సమయంలో రాజప్ప చెల్లెలు శారద (వేద) గ్రామంలో (సాయి తేజ్)ను ప్రేమిస్తుంది కానీ అది రాజప్పకు నచ్చదు. ఇక్కడే అసలు ట్విస్ట్-ఊరంతా గౌరవించే ఆ టీవీ ఒక్కసారిగా దొంగతనానికి గురవుతుంది. అనుమానాలన్నీ సతీష్‌పై పడతాయి. కానీ నిజంగా అతడేనా దొంగ? లేక మరెవరైనా? ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆ సమస్యను ఎలా పరిష్కరించారు అనేదే ఈ చిత్ర కథ.
మూవీ రివ్యూ..
దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటికి తీసుకెళ్తుంది. అయితే సినిమా ప్రారంభం చాలా నెమ్మదిగా సాగుతుంది. మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం, చిత్తూరు గ్రామీణ వాతావరణం, చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాకులతోనే నిండిపోతుంది. మెయిన్ కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ నుంచి కథనం మారిపోయింది.
ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారు అనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. సెకండ్ హాఫ్‌లో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, అన్ని లాజికల్ పాయింట్స్ ను టచ్ చేస్తూ ఇచ్చిన ముగింపు కథనానికి పెద్ద బలాన్నిచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లోని లోపాలను సెకండ్ హాఫ్ చాలా వరకు కవర్ చేసిందని చెప్పాలి. ఓవరాల్‌గా ఎమోషన్స్, ట్విస్టులతో సినిమా బాగానే ముందుకెళ్లింది.

నటీనటులు ఎలా చేశారంటే..
- హీరోగా సాయి తేజ్ కొత్తవాడైనా తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉంది.
- హీరోయిన్ వేద పాత్ర చిన్నదే అయినా, కథకు అవసరమైన భావోద్వేగాన్ని అందించింది.
- రాజప్ప పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సినిమాకు ప్రధాన బలం. అతని ఎక్స్‌ప్రెషన్స్, గ్రామ పెద్దగా చూపించిన బాడీ లాంగ్వేజ్ బాగుంది.
- మొత్తానికి, కొత్తవారైనా తమ పరిధిలో మంచి ప్రయత్నం చేశారు. అయితే అనుభవం లోపం కారణంగా కొన్ని సన్నివేశాల్లో నెమ్మదిగా అనిపిస్తుంది.
సాంకేతిక అంశాలు..
- దర్శకుడు మునిరాజు ఈ సినిమాతో సహజమైన గ్రామీణ వాతావరణాన్ని చూపించాలని ప్రయత్నించాడు. 90ల కాలాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడంలో విజయం సాధించాడు. కానీ కథనం విషయంలో అదే రియలిజం కొన్నిసార్లు నెమ్మదితనంగా మారింది.
- సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని చాలా నేచురల్‌గా చూపించింది. పల్లెటూరి ఇళ్లు, వీధులు, శివరాత్రి వేడుకలు-all these feel authentic. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ 90ల సెటప్‌ను బాగా రీక్రియేట్ చేసింది.
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. కానీ పాటలు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండేలా లేవు.
- ఎడిటింగ్ విషయంలో కాస్త టైట్‌గా ఉండాల్సింది-ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి ఉంటే బాగుండేది.
- చిత్తూరు యాసలో డైలాగ్స్ ఉండటం ఈ సినిమాకు రియలిస్టిక్ టచ్ ఇచ్చింది. కానీ అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు అర్థం కావడంలో సమస్యగా మారింది.
ప్లస్ పాయింట్స్..
- 90ల నాటి గ్రామీణ వాతావరణం
- సింపుల్ కాన్సెప్ట్‌లో మిస్టరీ ఎలిమెంట్
- సహజమైన నటన
- కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
- స్లో నరేషన్
- చిన్న కథను ఎక్కువగా లాగడం
- యాస వల్ల కనెక్ట్ సమస్య
- గుర్తుండని సంగీతం
ఫైనల్ వర్డిక్ట్ ; గ్రామీణ కథలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా.
రేటింగ్ ; 2.75/ 5












Click it and Unblock the Notifications