డోంట్ మిస్: రేపే ఆకాశంలో అత్యద్భుతం- జీవితంలో ఒక్కసారే

శనివారం ఆకాశంలో ఓ అద్భుతం ప్రారంభం కాబోతోంది. ఓ అరుదైన తోకచుక్క భూమి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. దీని పేరు C/2025 R3 (ప్యాన్‌స్టార్స్). ఈ వారం మొత్తం కూడా సాధారణ కంటితో దీన్ని చూడొచ్చు. మరీ ముఖ్యంగా టెలిస్కోపుల అవసరం లేకుండానే దీనిని చూడవచ్చు. సూర్యోదయానికి ముందు ఆకాశంలో అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూడాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. భారత్ లో వివిధ ప్రాంతాల నుంచి ఈ తోకచుక్క కనువిందు చేయనుంది.

శనివారం నుంచి..

సౌర వ్యవస్థకు అంచున ఉన్న ఈ తోకచుక్క ప్రస్తుతం మన సౌర కుటుంబంలోకి అడుగు పెట్టింది. ఈ నెల 18వ తేదీ (శనివారం) నుంచి మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. భూమికి చేరువ అయ్యే కొద్దీ దీని వెలుగు నాలుగు రెట్లు పెరుగుతుంది. చీకటి ప్రదేశాల నుండి చాలా మంది దీనిని సాధారణ కంటితో అంటే ఎటువంటి బైనాక్యులర్లు లేకుండా నేరుగా చూసే అవకాశం ఉంది.

Rare Long-Period Comet C 2025 R3 PANSTARRS Headed for Closest Approach See It Before It Fades

దాదాపు 1,70,000 సంవత్సరాలు..

తోకచుక్కలు సౌరవ్యవస్థ పుట్టుక సమయంలో మిగిలిపోయిన మంచు గడ్డల శిథిలాలు. అవి సూర్యుడికి దగ్గరైనప్పుడు వేడెక్కి, ప్రకాశవంతమైన తోకలను ఏర్పరచుకుని సంచరిస్తుంటాయి. ప్యాన్‌స్టార్స్ కూడా అటువంటిదే. సూర్యుడి చుట్టూ ఒక పూర్తి పరిభ్రమణం చేయడానికి దీనికి దాదాపు 1,70,000 సంవత్సరాలు పడుతుంది దీనికి. అందుకే ఇది అత్యంత అరుదుగా కనిపిస్తుంది. దీన్ని వీక్షించే అవకాశం అత్యంత విలువైనది కూడా.

పెరిహీలియన్ వైపు..

సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే పెరిహీలియన్ వైపు వేగంగా వెళుతోంది ఈ తోకచుక్క. ఏప్రిల్ 19న పెరిహీలియన్ కు మరింత చేరువ అవుతుంది. సుమారు ఒక వారం తర్వాత అంటే ఏప్రిల్ 25-26 మధ్య భూమికి దగ్గరగా వస్తుంది. ఇది- మనకు ఆ తోకచుక్క అత్యంత ప్రకాశవంతంగా కనిపించే సమయం. సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ, అది ఆకాశంలో మరింత దిగువకు వెళ్తున్నప్పుడు ఉత్తరార్థ గోళం నుండి చూడటం కష్టం అవుతుంది.

సూర్యోదయానికి సుమారు 90 నిమిషాల ముందు..

సూర్యోదయానికి సుమారు 90 నిమిషాల ముందు ఆకాశంలో తూర్పు వైపు ఇది తక్కువ ఎత్తులో ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇది కనువిందు చేయనుంది. పెగాసస్ స్క్వేర్ గా పిలిచే నాలుగు ప్రకాశవంతమైన నక్షత్రాల సమీపంలో దీనిని తేలిగ్గానే గుర్తించవచ్చు. ఈ నెల 17 నుండి 24 వరకు తెల్లవారు జామున 5:30 నుంచి 6:00 గంటల మధ్య తోకచుక్క కచ్చితమైన మార్గాన్ని తెలిపే చిత్రాలు, ఫైండర్ చార్ట్‌లు నక్షత్రాలను చూసేందుకు ఉపయోగపడే స్టార్ వాక్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

స్పష్టంగా చూడాలంటే..

తోకచుక్కను స్పష్టంగా చూడాలంటే, చీకటి ప్రదేశాన్ని ఎంచుకోవడం ఉత్తమం. తూర్పు దిశలో ఆకాశాన్ని చూడాలి. బైనాక్యులర్లు వాడటం మంచిది. ఈ నెలాఖరు నాటికి ఈ తోకచుక్క దక్షిణ దిశగా కదులుతూ సూర్యుడి కాంతిలో కలిసిపోతుంది. దీంతో ఉత్తరార్ధగోళంలో ఉండేవారికి శాశ్వతంగా దూరమౌతుంది. ఆ తరువాత దక్షిణార్ధగోళంలో పరిధిలో నివసించే వారికి కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+