తమిళనాట విజయ్ నిశ్శబ్ద విప్లవం, వారంలో మారిన లెక్కలు - గ్రౌండ్ రిపోర్ట్..!!
తమిళనాడు ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. డీలిమిటేషన్ వ్యవహారం తో తమిళనాడు ఎన్నికల సీన్ ఒక్క సారిగా మారిపోయింది. అంచనాలు తల కిందులు అవుతున్నాయి. రెండు ప్రధాన కూటములు.. తొలి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న విజయ్ మధ్య పోటీ కీలకంగా మారింది. విజయం పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం మొదలైంది. అటు పలు ప్రముఖ సర్వేలు తమ అంచనాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీ ఈ సారి భారీ ఆశలతో పొత్తులతో లెక్క లు మొదలు పెట్టింది. అయితే, ప్రముఖ సర్వే సంస్థ మాత్రం తమిళనాడులో పబ్లిక్ పల్స్ ఆధారం గా ఫలితాల అంచనాలను వెల్లడించింది.
ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూపు ఎస్ఏఎస్ తమిళనాడు ఎన్నికల వేళ అక్కడి పరిస్థితుల పైన తాజా అంచనాలను వెల్లడించింది. ఈ అంచనాల మేరకు తమిళనాడులో హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. సామాజిక - ప్రాంతాల వారీగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ నెల 27వ తేదీ వరకు ఉన్న పరిస్థితిని వెల్లడించింది. అధికార డీఎంకే కూటమికి ఎడ్జ్ కనిపిస్తున్నా.. రోజు రోజుకీ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. విజయ్ పాత్ర కీలకంగా మారుతోంది. సైలెంట్ ఓటింగ్ విజయ్ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల వారీగానూ ఈ సంస్థ విశ్లేషణలు చేసింది. హోరా హోరీ పోరులో డీఎంకే కూటమికి 116, ఎన్డీఏ కూటమికి 94 స్థానాలు వస్తాయని చెప్పింది. అదే విధంగా ఇతరులు 24 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని విశ్లేషించింది. కాగా, విజయ్ పార్టీ ప్రస్తుతం 14-15 శాతం ఉందని.. పోలింగ్ సమయానికి 18 శాతానికి చేరితే అన్నా డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.

విజయ్ వైపు యువత.. తటస్థ ఓటర్లు
అయితే, రాష్ట్రంలోని నాలుగు రీజియన్లలో పరిస్థితి వివరించింది. అందులో ఉత్తర జిల్లాల్లో రెండు కూటములు హోరా హోరీగా ఉన్నాయి. కొంగునాడు రీజియన్ లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డెల్టా రీజియన్ లో రెండు కూటములు నువ్వా నేనా అనే విధంగా తల పడుతున్నాయి. ఇక, దక్షిణ ప్రాంతంలోని 51 స్థానాల్లో రెండు కూటములు హోరా హోరీగా పోరాటం చేస్తున్నాయి. అయితే, విజయ్ కొత్తగా రాజకీయ ఎంట్రీ ఇస్తున్న వేళ.. చుట్టుముట్టిన వివాదాలు విజయ్ ఇమేజ్ ను ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డామేజ్ చేస్తున్నాయి. అనుభవం ఉన్న నేతలు పక్కన లేకపోవటం విజయ్ కు మైనస్ గా కనిపిస్తోంది. విజయ్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ పరిస్థితి క్రమేణా మెరుగు పడుతోంది. మొత్తంగా విజయ్ గ్రాఫ్ పోలింగ్ తేదీలు దక్కర పడుతున్న కొద్దిగా పెరుగుతన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ దక్కించుకునే స్థానాలు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. డీలిమిటేషన్ ఇప్పుడు ఎన్డీఏకు మైనస్ గా మారుతోంది. దీంతో.. పోలింగ్ నాటికి ఈ లెక్కల్లో మరింత మార్పు ఉండే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు.













Click it and Unblock the Notifications