Pok ఇక మనదే? పాక్ ను చావు దెబ్బ తీసిన డీలిమిటేషన్!

జమ్మూ కశ్మీర్ భౌగోళిక రాజకీయాల్లో భారత్ సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగం (PoK)లో కూడా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను భారత ఎన్నికల సంఘానికి అప్పగిస్తూ రూపొందించిన '2026 డీలిమిటేషన్ బిల్లు' పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పీవోకే తమ అంతర్భాగమేనని, అక్కడ కూడా భారత రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలు జరుగుతాయని ఢిల్లీ పరోక్షంగా ప్రపంచానికి చాటిచెప్పింది.

భారత్ వేసిన ఈ అడుగుతో పాకిస్థాన్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 17, 2026న పాక్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బిల్లును పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. "ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. వివాదాస్పద భూభాగంలో చట్టాలను మార్చే అధికారం భారతదేశానికి లేదు. పీవోకేను తాజా బిల్లులో చేర్చడం రెచ్చగొట్టే చర్య" అంటూ విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌ను ఎప్పటిలాగే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు పాక్ విఫలయత్నం చేస్తోంది.

PoK is Ours Indian Parliament Introduces Delimitation Bill to Redefine Seats in Occupied Kashmir

24 సీట్ల వ్యూహం.. భారత్ గట్టి సమాధానం!

వాస్తవానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం ఇప్పటికే 24 సీట్లు కేటాయించి ఉన్నాయి. ఇప్పటివరకు ఇవి ఖాళీగా ఉన్నప్పటికీ, తాజా డీలిమిటేషన్ బిల్లు ద్వారా ఆ ప్రాంతాల నియోజకవర్గాలను పునర్విభజించే అధికారం ఎన్నికల సంఘానికి లభించనుంది. అంటే, పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఆ ప్రాంతాల్లో కూడా భారత ప్రజాస్వామ్య ప్రక్రియను అమలు చేయడానికి పునాదులు వేస్తోంది.

Pakistan: పాక్ బరితెగింపు..కోల్‌కతా వరకు వస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం..!
Pakistan: పాక్ బరితెగింపు..కోల్‌కతా వరకు వస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం..!

అంతర్జాతీయ వేదికలపై ఢిల్లీ దూకుడు..

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) నుంచి సర్వసభ్య సమావేశం (UNGA) వరకు ప్రతి చోటా భారత్ ఒకే మాటపై నిలకడగా ఉంది. "పీవోకే సహా మొత్తం జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. ఇందులో మూడో పక్షం జోక్యాన్ని సహించం" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేస్తూ వస్తోంది. తాజా బిల్లు ఆ వాదనకు మరింత చట్టబద్ధతను చేకూర్చింది. పాక్ అభ్యంతరాలను భారత్ ఏమాత్రం పట్టించుకోకుండా తన పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం.

78 ఏళ్ల చరిత్ర చూస్తే ఎన్నికలే లేవు..

మనం వెనక్కి తిరిగి చూస్తే, బ్రిటిష్ పాలనలోనే మహారాజా హరిసింగ్ దార్శనికతతో జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునాదులు పడ్డాయి. 1934, 1938 మరియు 1947 సంవత్సరాల్లో 'ప్రజా సభ' పేరుతో ఎన్నికలు నిర్వహించారు. ఆనాడు ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, 1947 నాటి దేశ విభజన అనంతర పరిణామాలతో ఆ ప్రాంతం పాక్ ఆక్రమణలోకి వెళ్ళింది. దీంతో గత 78 ఏళ్లుగా అక్కడి ప్రజలకు భారత ప్రజాస్వామ్య ప్రక్రియ దూరమైంది.

పాకిస్థాన్‌పై డ్రోన్‌ దాడి.. ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా భీకర దాడులు!
పాకిస్థాన్‌పై డ్రోన్‌ దాడి.. ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా భీకర దాడులు!

భారత రాజ్యాంగం.. సంపూర్ణ అమలు

తాజా డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా, స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా భారత్ తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి పీవోకేలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది జరిగితే, భారత రాజ్యాంగం కాశ్మీర్ గడ్డపై అంగుళం అంగుళం సంపూర్ణంగా అమలు కావడమే కాకుండా, అంతర్జాతీయ సమాజానికి "పీవోకే భారత్‌లో అంతర్భాగం" అనే బలమైన సందేశం వెళ్తుంది.

పర్యాటక స్వర్గధామంగా పీవోకే!

భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఎన్నికలు జరిగి, శాంతిభద్రతలు నెలకొంటే.. కశ్మీర్ అందాలను వీక్షించడానికి పర్యాటక రంగం నూతన పుంతలు తొక్కుతుంది. ముజఫరాబాద్ నుంచి మీర్పూర్ వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రపంచ పటంలో నిలుస్తాయి. తద్వారా పీవోకే ప్రజల ఆర్థిక స్థితిగతులు మారడమే కాకుండా, ఆ ప్రాంతం దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అవతరించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+