వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వోటింగ్‌గు జగన్ సహా ముగ్గురు దూరం: కావూరి లాస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి ఎఫ్‌డిఐ ఓటింగులో పాల్గొన్న కావూరి సాంబశివ రావు ఇదే తన ఆఖరి ఓటు అని, ఇక సభకు రానని తేల్చి చెప్పారట. ఎఫ్‌డిఐలపై ఓటింగు నేపథ్యంలో ఆయన బుధవారం ఓటింగుకు హాజరయ్యారు. తనకు కేబినెట్లో చోటు దక్కక పోవడంతో కావూరి రాజీనామాకు సిద్ధపడిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్‌ నాథ్ కావూరికి ఫోన్ చేసి సమావేశాలకు హాజరుకావాలని కోరారు.

సహచర ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లగడపాటి రాజగోపాల్ కూడా కావూరిని బుజ్జగించారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ఓటింగ్‌కు హాజరు కావాలంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం జారీ చేసిన విప్‌ను కూడా కావూరి స్వీకరించారు. ఉదయాన్నే ఢిల్లీ వచ్చినా, తన నివాసంలోనే ఉండిపోయారు. సాయంత్రం 4 గంటలకు కావూరిని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పార్లమెంటుకు తీసుకొచ్చారు.

కావూరిని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆలింగనం చేసుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. జనవరి 1 నుంచి లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటున్నానని, కాంగ్రెసు పార్టీలో ఉండనని చెప్పారట. కాగా ఎఫ్‌డిఐ ఓటింగుకు డుమ్మా కొడతారని ప్రచారం జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. విమర్శల నేపథ్యంలో ఆయన హాజరైనట్లుగా చెబుతున్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ఓటేశారు.

ఎఫ్‌డిఐపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో టిడిపి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. టిడిపి ఎంపి రమేశ్ రాథోడ్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉండటంతో సభకు గైర్హాజరయ్యారు. టిఆర్ఎస్ ఎంపీలు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి, వైయస్సార్ కాంగ్రెసు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. జైల్లో ఉన్న జగన్, యుపిఏకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సభకు గైర్హాజరయ్యారు.

English summary
TDP MP Ramesh Rathode and Asaduddin Owaisi were not attended to FDI voting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X