గాలి రూ 10 కోట్ల బంగారం కొన్నాడు: నగల వ్యాపారి

గాలికి చెందిన 11 కేజీల బంగారాన్ని ఎలా విక్రయించింది బెంగళూరు నగల వ్యాపారి సత్రసాల రమేష్ ఏసీబీకిచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులో ఆర్ఎం గోల్డ్ ప్యాలెస్ పేరుతో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నానని, 2005 నుంచి గాలి, అతని భార్య లక్ష్మీ అరుణ మా దుకాణానికి తరచుగా వచ్చేవారుని, తమ వద్ద రూ.10 కోట్ల వరకు బంగారు నగలు, వజ్రాలు కొన్నారని అతను చెప్పాడు.
మార్కెట్‌లోకి కొత్త డిజైన్ వచ్చిందంటే మొదట లక్ష్మీ అరుణకు చూపించేవాడినని, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు కూడా తనకు తెలుసునని, మే మొదటి వారంలో సురేష్ బాబు ఫోన్ చేసి 5 నుంచి 10 కేజీల బంగారం అమ్మి నగదులోకి మార్చేందుకు సహకరించాలని కోరారని, అందుకు ప్రతిఫలంగా మంచి కమిషన్ ఇస్తానన్నారని అతను వివరించాడు.
మే 7న ఫోన్ చేసి జనార్దన్ రెడ్డి ఇంటికి రావాల్సిందిగా సూచించారని, ఇంట్లోకి వెళ్లి 11 గోల్డ్ బార్ (క్యాడ్‌బెర్రీ)లు తెచ్చారని, ఒక్కో బార్ కేజీ బరువుంటుందని, వాటిని విక్రయించి నగదును హైదరాబాద్‌లో తనకు అందించాలని కోరారని, అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని నగల వ్యాపారులైన చేతన్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్‌లకు ఫోన్ చేసి 10 కేజీల బంగారం విక్రయానికి ఉందని చెప్పడంతో తీసుకురమ్మన్నారని వివరించారు.
మే 10న రెండు విడతలుగా రూ.3.15 కోట్లకు విక్రయించి వారికి రూ.95 వేలు కమిషన్ చెల్లించానని, వ్యవహారం జరుగుతున్నంత సేపు సురేష్ బాబు ఎప్పటికప్పుడు తనతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారని, సురేష్ బాబు చెప్పిన చోట, చెప్పిన వారికి నగదును అందజేశానని రమేష్ వివరించారు.












Click it and Unblock the Notifications