మేం చెప్పం, తెల్సుకుంటాం: తెలంగాణపై బొత్స కామెంట్

కాంగ్రెసు సదస్సులో సహకార ఎన్నికల కార్యాచరణ రూపకల్పనపై చర్చ ఉంటుందని చెప్పారు. అఖిలపక్షంపై చర్చించమన్నారు. ఈ నెల 16న జరిగే సదస్సులో తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలు ప్రస్తావనకు రావని చెప్పారు. 2009 డిసెంబర్ 7వ తేదిన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై కాంగ్రెసు తన అభిప్రాయం చెప్పలేదన్నారు. అలాగే ఈసారి కూడా చెప్పక పోవచ్చునన్నారు. షిండే అడిగితే చూస్తుందన్నారు.
సున్నితమైన అంశంపై అధిష్టానం సమీక్షలు జరుపుతోందని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల దృష్ట్యా అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు చెప్పారు. కాంగ్రెసు సదస్సులో అన్ని ప్రాంతాల సమస్యలపై చర్చ జరుగుతుందని చెప్పారు.
కాగా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల ఒత్తిడి వల్లనే అఖిలపక్ష సమావేశంపై తేదీ వెలువడిందని మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లాలో అన్నారు. 28న చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications