హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి-ఎంపీలకు హ్యాండ్: ఆల్‌పార్టీపై నీరుగార్చిన కొత్తమెలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు పార్టీ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఎఫ్‌డిఐ ఓటింగు నేపథ్యంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తాము తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయించి ఓ అడుగు ముందుకేయించామని చంకలు గుద్దుకుంటున్న టి-ఎంపీలకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన పెద్ద గుదిబండలా మారిందనే చెప్పవచ్చు.

Telangana Congress MPs

బిజెపి, టిఆర్ఎస్, టిడిపి, సిపిఎం, సిపిఐ, వైయస్సార్ కాంగ్రెసు.. ఇలా అన్ని పార్టీలు తాము తెలంగాణపై తమ నిర్ణయాన్ని అఖిల పక్షంలో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతుండగా బొత్స మాత్రం అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెసు తన నిర్ణయాన్ని చెప్పదని, ఇతర పార్టీల నిర్ణయాన్ని మాత్రమే తీసుకుంటుందని చావు కబురు చల్లగా చెప్పేశారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ తాము నిర్ణయాన్ని చెప్పేకంటే ముందే కాంగ్రెసు తన నిర్ణయాన్ని చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఈ నేపథ్యంలో బొత్స కాంగ్రెసు నిర్ణయం చెప్పదని తేల్చేయడంతో అఖిలపక్షం నీరుగారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిన అధికార కాంగ్రెసు పార్టీయే నిర్ణయం చెప్పకపోతే మిగిలిన పార్టీలు వెళ్లే అవకాశాలు లేవు. ఇప్పటికే విపక్షాలు అన్నీ 28న అఖిలపక్షం అనేది కేవలం ఎఫ్‌డిఐల కోసం జిమ్మిక్కుగా కొట్టి పారేశారు. బొత్స వ్యాఖ్యలతో వారి ఆరోపణలకు బలం చేకూరింది.

ఏ రకంగా చూసిన మొదట తెలంగాణపై నిర్ణయం చెప్పాల్సింది కాంగ్రెసు పార్టీయే. ఎఫ్‌డిఐల వంటి పలు అంశాలపై ఏకపక్షంగా ముందుకెళ్తున్న కేంద్రం తెలంగాణపై కూడా అదే రకంగా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఇటు తెలంగాణవాదులు అటు సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అఖిలపక్షంలో మిగిలిన పార్టీల నిర్ణయాన్ని తీసుకునే అధికార కాంగ్రెసు.. తన నిర్ణయాన్ని చెప్పకపోవడం సరికాదు.

అందరికంటే ముందు కాంగ్రెసే అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. కానీ తాము చెప్పమని బొత్స ప్రకటన చేశారు. బొత్స ప్రకటనతో విపక్షాలు అఖిల పక్ష సమావేశానికి వెళ్లడానికి విముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి, తెరాస, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా, సిపిఐ వ్యతిరేకంగా ఉన్నాయి. మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశంలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. కాంగ్రెసు మనసులో ఏముందో ఎవరికి తెలియదు.

ఈ నెల 28తో ఓ పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇప్పటి వరకు ఆందరూ భావించారు. టి-కాంగ్రెసు ఎంపీలైతే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు సవాళ్లు విసిరారు. టిఆర్ఎస్, బిజెపిలకు విజ్ఞప్తి చేశారు. కానీ అధిష్టానం ఎఫ్‌డీఐల నుండి గట్టెక్కేందుకే టిఎంపీలకు అఖిల పక్ష సమావేశం అంటూ హ్యాండ్ ఇచ్చినట్లే. అయితే అఖిలపక్ష ప్రకటనపై వెనక్కి వెళ్లినట్లుగా ప్రజల్లో భావన రాకుండా తాము నిర్వహిస్తామని, కానీ తమ అభిప్రాయం చెప్పమనే కొత్త మెలిక పెట్టడం గమనార్హం. కాంగ్రెసు వెనక్కి వెళితే ఏ పార్టీ కూడా ముందుకు కదలదనే చెప్పవచ్చు.

English summary
PCC chief Botsa Satyanarayana has told on Friday that Congress party will not tell decision on Telangana in All Party meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X