శైలజానాథ్ చెడిపోయారు: హాస్యమాడిన ముఖ్యమంత్రి

లలితా కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ముఖ్యమంత్రి 200 మంది పిల్లలకు లాంఛనంగా కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలకు ప్రాథమికంగా కంటి పరీక్షలు నిర్వహించామని, అందులో 4 లక్షల 7 వేల మంది చిన్నారులకు కంటి సమస్యలున్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిలో 6 వేల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుగు గుర్తించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ రోజు ప్రారంభమైన చిన్నారి చూపు కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు మండల స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. పిల్లలు విద్యా బుద్ధులు నేర్చుకుంటూనే పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రోజూ క్రీడల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.
పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలతో పాటు ఇతర మెడికల్ చెకప్‌లు చేయిస్తామని ఆయన చెప్పారు. విద్యార్జన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరుసగా పథకాలను ప్రారంభిస్తూ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా చిన్నారి చూపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications