హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు చెప్తేనే: కోదండరామ్, అవి చెప్పాలి: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు వైఖరి చెప్తేనే అఖిల పక్ష సమావేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం సాధ్యమవుతుందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ అంశం కేవలం కాంగ్రెసుకు సంబంధించింది మాత్రమేనని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు భావించడం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల పేరులోత అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెసు కోరడాన్ని తాము కుట్రగానే భావిస్తామని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంపై రెండు మూడు రోజుల్లో స్టీరింగ్ కమిటీ కార్యాచరణ తయారు చేస్తుందని చెప్పారు.

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే ఈ నెల 28వ తేదీకి ముందే కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు తమ వైఖరులను వెల్లడించాలని తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓట్లేసిన ప్రజల ముందు నోరు విప్పకుండా అఖిల పక్ష సమావేశంలో చెబుతామని అనడం మరో మోసానికి నిదర్శనమని ఆయన అన్నారు.

అఖిల పక్ష సమావేశంలో మాయోపాయం చేసేందుకు ప్రయత్నించే పార్టీల జెండాలను, గద్దెలను తెలంగాణలో కూలుస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 16వ తేదీన జరిగే సమావేశంలో తెలంగాణ మంత్రులు తెలంగాణపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలంతా తెలంగాణ విషయంలో పట్టుదలతో ఉన్నారని ఆయన అన్నారు. తాను చేపట్టిన తెలంగాణ భరోసా యాత్రతో యువకుల్లో భరోసా కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుత స్థితిలో రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన సూచించారు.తెలంగాణ ఏర్పడితేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి మనుగడ ఉంటుందని కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతామని అన్నారు. అవసరమైతే తెలంగాణపై తీర్మానం చేసి అఖిల పక్షానికి పంపాలని డిమాండ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Telangana political JAC chairman Kodandaram said that Congress should give clarity on Telangana issue before all party meeting to be held on December 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X